వజ్రం నకిలీదా..నిజమైందా అనేది ఈ సింపుల్ టెస్ట్ తో తెలుసుకోవచ్చు

వజ్రం చాలా విలువైనది అని అందరికీ తెలిసిందే. అయితే వజ్రం పేరు చెప్పి  మోసం చేసే వారు బయిట బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా తక్కువ రేటుకు వస్తోందని డూపిల్ కేటు వజ్రం రహస్యంగా కొనుక్కుని తర్వాత ఏడుస్తూ కూర్చునేవారు ఉన్నారు. అయితే అసలు వజ్రం నిజమైందా లేక నకిలీదా అని కనిపెట్టే విధానం తెలుసుకుంటే ఆ సమస్య రాదు. ఇప్పుడు మేం మీకు ఆ సీక్రెట్ చెప్పబోతున్నాం. 
1.  ప్రింటెడ్ పేపర్ టెస్ట్
ఓ ప్రింటెడ్  పేపరు తీసుకుని వజ్రం గుండా దానిపై రాసి ఉన్న అక్షరాలు చదవటానికి ప్రయత్నించండి. అయితే మీరు ఆ అక్షరాలు చదవలేకపోయినట్లైతే అది నిజమైన వజ్రం. అలా కాకుండా మీరు వజ్రం లోంచి క్రింద ఉన్న  అక్షరాలు చదవగలిగితే అది గాజు ముక్క లేదా వేరే దానితో తయారైన వస్తువు. సాధారణంగా ఈ టెస్ట్ తోటే ఒరిజనల్ అవునా కాదా అనేది తెలిసిపోతుంది. 
 2 ఫాగ్ టెస్ట్
సాధారణంగా వజ్రాలు హీట్ కండక్టర్స్. మీరు డైమండ్ ప నోటితో గాలిని వదిలితే నిజమైన వజ్రం అయితే మీరు నోటితో వచ్చిన పొగ ఆ డైమండ్ పై కొద్ది క్షణాలు కూడా ఉండదు. అదే నకిలీ వజ్రం అయితే కొద్ది సెకండ్స్ పాటు మన నోటి  గాలితో పాటు వచ్చిన తేమ దానిపై కనపడుతుంది. అయితే ఈ టెస్ట్ చేసేముందు ఆ వజ్రాన్ని శుభ్రంగా క్లీన్ చెయ్యాలి  కొన్ని వజ్రాలలో రంగురంగుల గీతలు, చారికలు, చుక్కలు కనిపిస్తుంటాయి. ఇవి స్పటికంలోని లోపాలవల్ల ఏర్పడతాయి. స్పటికం నిర్మాణంలో మామూలుగా ఉండాల్సిన బొగ్గు పరమాణువుల స్థానాలలో కొన్నిచోట్ల ఇతర ధాతువుల పరమాణువులు వచ్చి చేరటం, స్పటికంలోపల పగుళ్లు ఉండటంలాంటివి పై లోపాలలో కొన్ని రకాలుగా చెప్పవచ్చు.